– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1: నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతిలు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చిన ‘ఇండి’ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పేరొందిన న్యాయవేత్తలలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒకరని, అలాంటి నేపద్యం కలిగిన వ్యక్తిని బలపర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ‘ఇండి’ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసి ఉన్నత విలువలకు పెద్ద పీట వేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





