కొమురవెల్లి ప్రజాతంత్ర నవంబర్ 25: సిద్ధిపేట్ జిల్లా కొమురవెల్లి గ్రామంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంకు కొత్త ఉత్సవ కమిటీను ఎండోమెంట్స్ శాఖ 25-11-2025 తేదీన నియమించినట్టు కమిషనర్ కార్యాలయం ఉత్తర్వు విడుదల చేశారు. ఈ కమిటీ పదవీకాలం 10-12-2025 నుంచి 21-03-2026 వరకు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా దేవస్థానంలో జరగబోయే 14 డిసెంబర్ కళ్యాణ మహోత్సవం, అనంతరం జరిగే జాతర – బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఈ కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. ఉత్సవ కమిటీ నియామకం తెలంగాణ చారిటబుల్, హిందూ రీలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ & ఎండోమెంట్స్ యాక్ట్ 1987 నిబంధనల ప్రకారం చేపట్టారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్ కుమార్ యాదవ్, అలుగల మల్లేశం, బొచ్చు ఎల్లయ్య, గొరిగె రవి ఎంపికయ్యారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





