కాశ్మీర్‌తో కలిపి భారత్ మ్యాప్

– ప్రాధేయ‌ప‌డిన పాక్‌.. తొలగించిన అమెరికా

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: భారత్‌తో ట్రేడ్ డీల్‌ కుదిరిన వేళ అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన భారత్ మ్యాప్‌పై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. దాయాది పేర్కొంటున్నట్టు కాకుండా భారత్ మ్యాప్ ఉన్నది ఉన్నట్టుగా(కాశ్మీర్‌తో కలిపి) అమెరికా షేర్ చేసింది. అగ్రరాజ్య అధికారులకు పాకిస్థాన్ పాల‌కులు నచ్చజెప్పి ఆ మ్యాప్‌ను తొలగింపజేశారు. కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించి కశ్మీర్‌ను జీవనాడిగా చెప్తూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న సంగ‌తి విదిత‌మే. ఇలాంటి సమయంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన భారత్ మ్యాప్‌ను తట్టుకోలేకపోయిన పాకిస్థాన్.. అమెరికా అధికారులను ఒప్పించి దాన్ని తొలగించాలని ప్రాధేయపడటంతో వారు దానిని తొలగించారు. మ్యాప్ షేర్ చేయగానే తాము వెంటనే అగ్రరాజ్య అధికారులను సంప్రదించామని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి వెల్లడించడమే ఇందుకు నిదర్శనం. కాగా, కాశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని బలంగా వినిపిస్తోంది. ఎప్పటికీ కాశ్మీర్ భారత భూభాగమేనని తేల్చిచెప్పింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు పీవోకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *