– మన దేశ దిగుమతులపై యు.ఎస్. 50శాతం టారిఫ్
– సవాళ్లను ఎదుర్కొంటామన్న ఆర్‌బీఐ
వాషింగ్టన్,ప్రజాతంత్ర, ఆగస్ట్26: భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 6న ఈ ఎగ్జిటీవ్ ఆర్డర్‌పై 14329పై సంతకం చేసిన ట్రంప్..ఈ నెల 27 నుంచి 50 శాతం టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో తాజాగా 25 అదనపు సుంకాలపై అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసులు జారీ చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త సుంకాలు ఆగస్ట్ 27 తెల్లవారుజాము 12.01 గంటల నుంచే అమల్లోకి వస్తాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోమ్‌లాండ్ ఆఫ్ సెక్యూరిటీ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన అధిక సుంకాల్లో మొత్తం ఎగుమతిదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే.. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర మాత్రం టారిఫ్‌ల ప్రభావంపై మాట్లాడారు. యుఎస్ విధించిన 50 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. యుఎస్ టారిఫ్‌లు దేశీయ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తే ఆర్‌బిఐ తగిన విధాన చర్యలతో స్పందిస్తుందన్నారు. మేము బ్యాంకింగ్ రంగానికి తగినంత నగదు లభ్యతను అందించాం. ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాలకు మద్దతును ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఆర్‌బిఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే మరోవైపు ఆర్థిక వృద్ధిపై దృష్టి కోల్పోలేదని మల్హోత్ర అన్నారు.భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ వద్ద ఇప్పటికే 695 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయని.. ఇవి 11 నెలల విదేశీ వాణిజ్యానికి సరిపోతాయన్నారు. సుంకాల మొత్తం ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అయితే.. రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, దుస్తులు, ఎంఎస్‌ఎంఇ రంగాలపై కొంత ప్రభావం ఉండవచ్చన్నారు. ప్రభుత్వం ఉచిత వాణిజ్య ఒప్పందాలపై కూడా దృష్టి సారిస్తోందన్నారు. వృద్ధికి తమ వంతుగా ఇప్పటికే రెపోరేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించిందని గుర్తు చేశారు. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అంశాలను అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. బ్యాంక్ రుణాలను విస్తరించేందుకు అవసరమైన చర్యలను తాము పరిశీలిస్తున్నామన్నారు. పెట్టుబడుల సైకిల్‌ను సృష్టించేందుకు వీలుగా కార్పొరేట్‌లు, బ్యాంక్‌లు ఓ తాటి పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే దేశాభివృద్ధి ముందు కెళ్తుందని మల్హోత్ర అన్నారు. ధరల స్థిరీకరణ, ఆర్థికవృద్దే లఁ్‌యంగా ద్రవ్య పరపతి విధానం కొనసాగుతుం దన్నారు. స్థూలంగా భారత ఆర్థికవ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




