– హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: యూఎసఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఆయన సీఎంతో చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు, రుణమాఫీ ఇతర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్‌కు రావాల్సిందిగా సీఎంను మాట్ మేయర్ ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్‌ను మాట్ మేయర్‌కు సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఫస్ట్ లేడీ ఆఫ్ డెలావర్ లారెన్ మేయర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





