యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ యూరియా కేంద్రాలు 12 వేల వరకు ఉండగా ఎక్కువమంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అదనంగా రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. సోమవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో రైతు వేదికల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు గోపి తెలిపారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి మానిటరింగ్‌ చేస్తున్నామన్నారు. యూరియా కోసం రైతులు గంటలతరబడి క్యూలల్లో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సీజన్‌ వరకే రైతు వేదికల్లో యూరియా పంపిణీ కొనసాగనున్నట్లు గోపి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *