యూరియా వైఫల్యం కేంద్రానిదే

– ప్రభుత్వంపై బురదజల్లుతున్న బిఆర్‌ఎస్‌
‌- మండిపడ్డ మంత్రి సీతక్క

ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.  ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విమర్శలు చేసి బదనాం చేస్తోందని ఆరోపించారు. యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిందలు వేస్తోందని ఆమె అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని విమర్శించిన మంత్రి సీతక్క, తాము భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని హా ఇచ్చారు. అలాగే, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను, మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరిన ఆమె, స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *