యూరియాపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు

– నిన్న 9 వేలు, నేడు 5 వేల మెట్రిక్‌ టన్నులు రాక
– మరో వారంలో రానున్న 27,470 మెట్రిక్‌ టన్నులు
– ఐదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి
` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రానికి 9,000 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా కాగా ఈ రోజు మరో 5,000 మెట్రిక్‌ టన్నులు చేరనున్నదని వెల్లడిరచారు. ఈ యూరియా రైల్వే రేక్‌ పాయింట్లయిన సనత్‌నగర్‌, వరంగల్‌, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారం రోజుల్లో కరాయికల్‌, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని తెలిపారు. డిమాండ్‌కనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు తక్షణమే అందేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

5 రోజుల్లో పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలి

ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, ఐదు రోజుల్లోపు నివేదికను అందచేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడిరచారు. రైతుల సంక్షేమం, వారి పంటల రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *