– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: కేంద్రం నుంచి జరగాల్సిన యూరియా సరఫరా గురించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకోనున్నదని వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యూరియా గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్‌నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి చేరుకోనున్నదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుండి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని తెలిపారు. ఆ పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్‌నగర్, గజ్వేల్ ప్రాంతాలకు చేరుకోనున్నదని, అక్కడి నుండి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కాగా, రెండు రోజుల భారీ వర్షాల కారణంగా పంటలకు కలిగిన నష్టాలపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. బృందాలుగా ఏర్పడి జిల్లాలలో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించాలన్నారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం యూరియాను సరఫరా చేసిందని పేర్కొన్నారు. యూరియా కొరతతో కొంతమంది రాజకీయలు చేశారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



