యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌ లైబ్రరీ, వివిధ ఇన్‌స్టిట్యూట్స్‌ దగ్గర రాత్రిపగలు చదువుతూ ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్నారుని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వక, ఏ విధమైన స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందిదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబిస్తోందన్నారు. నిరుద్యోగులను రోడ్డుపైకి వచ్చేలా చేసి వారిపట్ల కఠినంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 35,000, లక్ష ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పడం మాత్రమే తప్ప నిజమైన లెక్కలు చూపడం లేదని అయన అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం, యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ కూడా పరీక్షలు సమయానికి నిర్వహించాలని కోరారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగకముందే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *