ఉప్పల్‌-నారపల్లి కారిడార్‌ వచ్చే దసరాకు పూర్తి

– ఆ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి
– మేడారం జాతర నాటికి నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కారిడార్‌ పనులు 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా ఆర్‌అండ్‌బి, ఆర్‌టీహెచ్‌ అధికారులకు, నిర్మాణ సంస్థకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గతుకుల రోడ్డుపై వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే బీటీి రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఉప్పల్‌-వరంగల్‌ మార్గంలో అధికారులు ఇప్పటికే బీటీి రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఈ మార్గంలో ప్రయాణించే వారికి, మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. మొత్తం 5.5 కి.మీకు గాను 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తయిందనీ, మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీి రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడిరచారు. బీటీ రోడ్డు పనులు, ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు షిఫ్టుల వారీగా శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకతీతంగా 2026 దసరా నాటికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page