టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ అరుణ్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: నాగర్ కర్నూలుకి చెందిన టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ రచించిన శూన్యం-కవిత్వం, బిగ్ బ్యాంగ్ వ్యాసాల సంపుటిని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీ-స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, టీఎలఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య సంయుక్తంగా ఆవిష్కరించారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం (టీఎల్‌ఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పుస్తక పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శాస్త్రీయ స్పృహతో, దేశ భక్తితో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నవ్వతతో కూడిన మానవీయ కోణంలో సామాజిక మార్పే లక్ష్యంగా అరుణ్ అద్భుతమైన రచనలు చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ప్రేరణ ఇచ్చే పుస్తకాలు మరిన్ని రాయాలని ఆకాంక్షిస్తూ అరుణ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఫిజిక్స్ అరుణ్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన టీఎలఎఫ్ ఆధ్వర్యంలో పుస్తక పరిచయ సభను నిర్వహించడం తనకు ఎంతో గర్వంగా వుందన్నారు. భవిష్యత్తులో బాధ్యతాయుతంగా ఇంకా మెరుగైన రచనలు చేస్తానని, తనని ఎంతో ప్రోత్సహిస్తున్న డాక్టర్ కత్తి వెంకటస్వామి, రామకృష్ణయ్యలకు, రెండు పుస్తకాలు సమాజంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ వెనిగళ్ల రాంబాబు, రవికిరణ్ రెడ్డి, శ్రీనివాసులు, నరసింహారెడ్డి, సంతోష్, ఎల్లన్న తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బొల్లేపల్లి వేణు, రవి, శ్రీనివాస్ రెడ్డి, మార్కండేయ, కురుమూర్తి, సదానందం, ఫరీద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *