నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం

– తడిసి ముద్దయిన వరి, పసుపు పంటలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది.  బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోటగిరి, పోతంగల్, బోధన్, ఎడపల్లి ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. జుక్కల్, బిచ్కుంద నిజాంసాగర్ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లోని పసుపు రైతులను అకాల వర్షం ఇబ్బందికి గురిచేసింది. ఒకట్రెండు రోజుల్లో పసుపును అమ్మేందుకు రైతులు సిద్ధమవుతుండగా పసుపు కుప్పలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇదిలావుంటే ఇంకా కొన్నిచోట్ల పంటలు కోతకు రాలేదు. విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. గ్రావిÖణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట కరెంట్ సరఫరా చేస్తుండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు పగటిపూట లో వోల్టేజీ కారణంగా ప్రజలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముదిరిన తరుణంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో సుమారు 18 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేసే వారని, అయితే, ఇప్ప్పుడది 12 నుంచి 16 గంటలకే పరిమితం కావడం, మరోవైపు సాంకేతిక కారణాల వల్ల సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండడం సాగుకు ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తుండడంతో నిద్ర కరవవుతున్నదని చెబుతున్నారు.

పసుపు రైతులకు ప్రభుత్వం భరోసా

హైదరాబాద్‌ : పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తేమ కలిగిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రైతులను ఇబ్బంది పెడితే మార్కెట్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్‌ ‌మార్కెట్‌కు పసుపు భారీగా వస్తోంది. 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం బిడ్డింగ్‌ ‌పూర్తి చేశాం. పసుపు కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించాం. మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధర చెల్లిస్తున్నాం. రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం అని తుమ్మల పేర్కొన్నారు. మంగళవారం  మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…ఈ మేరకు పసుపు రైతులకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. తడిసిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను హెచ్చరించారు. మార్కెట్‌ ‌యార్డు అధికారులు రైతులను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి తుమ్మల వార్నింగ్‌ ఇచ్చారు. . నిజామాబాద్‌ ‌మార్కెట్‌కు ప‌సుపు 4,500 కుప్పలు (27,400 బస్తాలు) యార్డుకు చేరిందన్నారు. 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉందని చెప్పిన మంత్రి.. పసుపు రక్షణకు 1,500 టార్పాలిన్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గాలులు, వర్షాలతో 70 – 80 కుప్పలు తడిశాయన్నారు. దీని కారణంగా దాదాపు 40 మంది రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన పసుపును పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని మార్కెట్‌ ‌యార్డ్ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *