తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె వంటవార్పు ,రాస్తారోకోలు, బంద్ లు, నిరసనలు, మిలియన్ మార్చ్ సాగరహారం ,రైలు రోకో ,అసెంబ్లీ ముట్టడి లు, రిలే దీక్షలు, అనేక కార్యక్రమాలలో యానాల లింగారెడ్డి లేని పోరాట రూపాలు లేవు.విద్యార్థి ఉద్యమాకారులకు భరోసాను నిస్తూ , ధైర్యాన్నిస్తూ వారికి ఉద్యమంలో ముందుకు నడిపించేవాడు. అందరిని కలుపుకు పోయే తత్వం తో సాటి మనిషి కి సమయాన్ని వెచ్చించి ఆప్యాయంగా పలకరించే లింగారెడ్డి మరణం అనేది ఊహించలేనిది.
తెలంగాణ మలిదశ ఉద్యమకారులు,కవులు, కళాకారులు, మేధావులు ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో అనేక మంది అకాల మరణాలు చెందడం కలిచివేస్తుంది.నకిరేకల్ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, ప్రస్తుత కాంగ్రెస్ జిల్లా నాయకులు నకిరే యానాల లింగారెడ్డి 8 సెప్టెంబర్ 2024 న ఉదయం తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో ఏదో కరిచింది అని చెప్పడంతో అక్కడ పని చేస్తేన్న కూలీలు లింగారెడ్డి ని బ్రతికించుకునేందుకు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన యానాల లింగారెడ్డి చిన్నతనం నుంచే ప్రగతిశీల భావాలు కలిగి ఉండడంతో సామాజిక చైతన్యంతో విద్యార్థి దశలో విద్యారంగ సమస్యలపై పోరాటం నిర్వహించారు.ప్రజా, కార్మిక రంగా సమస్యలపై పోరాటం చేస్తూనే 2009 నుంచి 2014 వరకు సాగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన వెనకడుగు వెయ్యకుండా నిత్య నిర్బంధాలను ఛేదించి ముందుకు వెళ్ళాడు. నకిరేకల్ ప్రాంతంలో ఉద్యమ కాలంలో పోలీసుల నిర్బంధాలను ఛేదించి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది.
నకిరేకల్ పట్టణంలో పరిసర ప్రాంతాలలోని ఉద్యమకారులు తమ ఇండ్లలో నిద్రపోలేని పరిస్థితి నిర్బంధం కొనసాగింది .అక్రమ అరెస్టులు ,కేసులు, బైండోవర్లు అలాంటి నిర్బంధాలను తట్టుకొని కుటుంబ సమస్యలను అధిగమించి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా నాయకత్వం వహించిన వారిలో లింగారెడ్డి ఒక్కరూ ..తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా భావజాల వ్యాప్తి కోసం స్వయంగా ఆయన వాల్ రైటింగ్ చేసేవాడు. తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి టిఆర్‌ఎస్ ప్రభుత్వం యానాల లాంటి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించలేదని ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కేసుతో జైలుకు వెళ్లిన డాక్టర్ చెరుకు సుధాకర్ ,ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేముల వీరేశం వెంట యానాల ప్రయాణం కొనసాగింపులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవను నిస్వార్థంగా చేశాడు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బిఆర్‌ఎస్ ను వీడిన డాక్టర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ వేదికలో వ్యవస్థాపక సభ్యులుగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహించాడు. మారిన పరిణామాల దృష్ట్యా బిఆర్ ఎస్ ఆ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేదికలు వేరైనాప్పటికీ ఆయన లక్ష్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే పనిగా సామాజిక సేవలో ముందంజలో ఉండడమే లక్ష్యంగా ప్రతినిత్యం ముందుకు వెళ్లేవాడు.
అటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉద్యమంలో భాగస్వామ్యం అయేవాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అసహజ మరణాలు క్రమక్రమంగా పెరగడంతో ఓ తరం వెళ్ళిపోతుంది. మినీ ఉస్మానియా గా తెలంగాణ ఉద్యమంలో పేరు గావింపబడిన నకిరేకల్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె వంటవార్పు ,రాస్తారోకోలు, బంద్ లు, నిరసనలు , మిలియన్ మార్చ్ సాగరహారం ,రైలు రోకో ,అసెంబ్లీ ముట్టడి లు, రిలే దీక్షలు, అనేక కార్యక్రమాలలో యానాల లింగారెడ్డి లేని పోరాట రూపాలు లేవు. విద్యార్థి ఉద్యమాకారులకు భరోసాను నిస్తూ , ధైర్యాన్నిస్తూ వారికి ఉద్యమంలో ముందుకు నడిపించేవాడు.
అందరిని కలుపుకు పోయే తత్వం తో సాటి మనిషి కి సమయాన్ని వెచ్చించి ఆప్యాయంగా పలకరించే లింగారెడ్డి మరణం అనేది ఊహించలేనిది. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో సీమాంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బస్సులను తరలిస్తున్న సమయంలో బస్సులు నకిరేకల్ చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు బస్సులను అడ్డుకోవడం ,ఆ తరువాత కేసులు జైలుకు వెళ్లిన వారిలో లింగారెడ్డి ఒక్కరూ.. జైలు ,నిర్బంధాలు ,లాఠీ దెబ్బలు అటు పోట్లను ఎదురుకున్నాడు.
ప్రగతిశీల భావాలు కలిగి ఉన్న యానాల లింగారెడ్డి సామాజిక ఉద్యమాల వైపు మక్కువగా ఉండేవాడు.యాడ వున్నాఓ లింగన్న.. మళ్లీ వస్తావా మా కాడికి అంటూ.. తెలంగాణ ఉద్యమరుడా యానాల నీ ప్రయాణం పోరాటమే కదా… అన్న లింగన్న ..అమరుడు అయ్యవా అంటూ కళాకారులు పాటలు పాడుకుంటూ కన్నీటి సంద్రోహం నడుమ అంత్యక్రియలు పూర్తిఅయ్యయి.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కరొక్కరు అకాల మరణం చెందడంతో ఓ తరం వెళ్లిపోవడంతో భవిష్యత్తు తరాలకు ప్రజా ఉద్యమాలకు,నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటు. యానాలకు వినమ్రంగా జోహార్లు అర్పిదాం..
– వేముల గోపీనాథ్
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు,
9666800045.





