పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు

– కువైట్‌ ‌విమానాశ్రయంపై ఇరాన్‌ ‌దాడి

టెహ్రాన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ ‌దేశాలపై ఇరాన్‌ ‌డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌  అం‌తర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్‌ ‌దాడికి పాల్పడింది. డ్రోన్‌ ఓ ఆయిల్‌ ‌ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్లు కువైట్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా దాడులకు దిగాయి. అందులో ఒక డ్రోన్‌ ‌విమానాశ్రయ పరిసరాల్లోకి దూసుకువచ్చి అక్కడే ఉన్న ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం దాటికి ట్యాంకర్‌ ‌పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. విమానాశ్రమం పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌ ‌డ్రోన్లతో గల్ఫ్ ‌దేశాలపై విరుచుకుపడుతోంది. తాజా దాడి కువైట్‌ ‌భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కువైట్‌ ‌ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంటలు అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్‌ ‌తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇరాన్‌ ‌నుంచి వచ్చిన పలు డ్రోన్లు, క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్‌ ‌దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందని కువైట్‌ ‌సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ద్రువీకరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *