గుర్తింపు లేని పార్టీలు ఫండింగ్ నివేదికలు గడువు లోపు సమర్పించాలి

–  సీఈఓ సి.సుద‌ర్శ‌న్‌ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ) రాజకీయ విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను నిర్ణయించిన గడువులోపలే తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుద‌ర్శన్ రెడ్డి సోమవారం టాప్ ప్రియారిటీతో ఆదేశాలు జారీ చేశారు. గడువు పూర్తయ్యాక అందే ఏ విరాళాల నివేదికనైనా చట్ట ఉల్లంఘనగా పరిగణించి రికార్డులోకి తీసుకోము అని స్పష్టం చేశారు. ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్లు 29బి, 29సి ప్రకారం విరాళాల నివేదికలు, ఆడిటెడ్ వార్షిక ఖాతాలు, పూర్తి ఎన్నికల ఖర్చుల ప్రకటనలను పార్టీలు సీఈఓ కార్యాలయానికి సమయానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతినిధుల చట్టం, 1951లోని సెక్షన్ 29సి(3), ఎన్నికల నిర్వహణ నియమాలు, 1961లోని రూల్ 85బి ప్రకారం గడువు దాటిన సమర్పణలు చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామ‌ని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నిధుల వ్యవహారంలో పారదర్శకత, బాధ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సీఈఓ కార్యాలయం తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *