అనవసర ప్రచారం- ఆందోళనలో జనం

కోవిడ్ మహమ్మారి అంతర్ధానంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి నూతన సంవత్సరంలో మరో వైరస్ ఉత్పన్నమై ఖండాంతరాలకు వ్యాపించడం మొదలైనది.భారత దేశంలో కూడా హెచ్ఎంపివి పలు నగరాల్లోకి ప్రవేశించింది. కర్నాటక,రాజస్థాన్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొద్ది మంది పిల్లలు ఈ వ్యాధికి గురైనట్లు, హైదరాబాద్ నగరంలో కూడా స్వల్ఫ స్థాయిలో కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఈ వైరస్ 5 సంవత్సరాల లోపు  చిన్న పిల్లలకే సోకుతుందని, జలుబు,దగ్గు,జ్వరం,శ్వాస కోశ సంబంధమైన సమస్యలతో హెచ్ ఎంపివీ లక్షణాలు కొరోనా వైరస్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తున్నది. ఈ వైరస్ వలన బ్రాంకైటీస్,న్యుమోనియా  వంటి వ్యాధులు రావచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి..  

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా “హ్యూమన్ మెటా నిమోవైరస్”గురించిన చర్చ  విస్తృతంగా కొనసాగుతున్నది. కోవిడ్ అనుభవాల దృష్ట్యా ఈ వైరస్ కూడా ప్రణాంతకంగా మారే అవకాశముందనే భయం కలగడం సహజం. కాని వాస్తవాలను తెలుసుకోకుండా బోగస్ ప్రచారాలను నమ్మడం,వాటిని వ్యాప్తి చేయడం  సబబు కాదు.ప్రపంచ దేశాలన్నీ చైనాలోని వూహాన్ లో 2019లో పుట్టిన కొరోనా వైరస్ కు అతలాకుతలమై పోయాయి. 1960 వ సంవత్సరంలో వెలుగు చూసిన కొరోనా వైరస్ పక్షులపైన,కొన్ని జీవజాతులపైన తన ప్రభావాన్ని ప్రదర్శించింది. అయితే 2019 లో ఉద్భవించిన కొత్త కొరోనా వైరస్ మానవ జాతిపై మహోగ్ర రూపం చూపించింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.కోవిడ్ వలన ప్రపంచం సుమారు రెండు సంవత్సరాల పాటు  పూర్తిగా స్తంభించి పోయింది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. విద్యావ్యవస్థ పూర్తిగా చతికిలబడింది. కోవిడ్ తర్వాత కోవిడ్ ఉత్పరివర్తనాలు కొన్ని దేశాల్లో తన ప్రభావం చూపించినా, భారత్ లో వాటి ప్రభావం అంతగా చూపలేదు.
యూరప్ దేశాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు.కొరోనా మహమ్మారి చైనా ల్యాబ్ లో తయారైనదని, ఈ వైరస్ వ్యాప్తికి చైనా కారణమని పలు ప్రపంచ దేశాలు దూషించాయి. నిజమేదో,అబద్ధమేదో తెలియదు కాని, ఈ వైరస్ వలన చైనాలో ప్రపంచానికి తెలియని మరణాలు  సంభవించాయని పలు వార్తాకథనాలు వెలువడ్డాయి. ప్రపంచం కోవిడ్ నుంచి కోలుకున్న  తర్వాత కూడా చైనాలో విధించిన నిర్బంధం వలన ప్రజలు బయటకు రాలేక పోయారు. ప్రజలు తిరగబడి,బయటకు రావడం జరగడంతో కమ్యూనిటీ స్ఫ్రెడ్ వలన వైరస్ కొంతకాలం ప్రజలను పీడించి, సర్ధుమణిగింది.  ఏ వ్యాధి అయినా పూర్తిగా వ్యాపించిన తర్వాతే బలహీనపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరిగిన తర్వాత కొరోనా వైరస్ తన ప్రభావాన్ని కోల్పోయి,పరిస్థితులు సాధారణ స్థితికొచ్చాయి.
       కోవిడ్ మహమ్మారి అంతర్ధానంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి నూతన సంవత్సరంలో మరో వైరస్ ఉత్పన్నమై ఖండాంతరాలకు వ్యాపించడం మొదలైనది.భారత దేశంలో కూడా హెచ్ఎంపివి పలు నగరాల్లోకి ప్రవేశించింది. కర్నాటక,రాజస్థాన్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొద్ది మంది పిల్లలు ఈ వ్యాధికి గురైనట్లు, హైదరాబాద్ నగరంలో కూడా స్వల్ఫ స్థాయిలో కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఈ వైరస్ 5 సంవత్సరాల లోపు  చిన్న పిల్లలకే సోకుతుందని, జలుబు,దగ్గు,జ్వరం,శ్వాస కోశ సంబంధమైన సమస్యలతో హెచ్ ఎంపివీ లక్షణాలు కొరోనా వైరస్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తున్నది. ఈ వైరస్ వలన బ్రాంకైటీస్,న్యుమోనియా  వంటి వ్యాధులు రావచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే ప్రస్తుతం వెలువడుతున్న వార్తలో వాస్తవం లేదని, సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. చైనాలో హెచ్ఎంపివీ వలన హాస్పిటల్స్  నిండిపోతున్నాయని, లాక్ డౌన్ ప్రకటించారని చేస్తున్న ప్రచారంలో నిజానిజాలు సంగతి వదిలేసి,అనవసరమైన భయాందోళనలకు గురికావడం మంచిది కాదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధిష్టమైన ప్రకటన చేసేవరకు ప్రజలు ఎలాంటి ఉహాగానాలను నమ్మకూడదు. ” “హ్యూమన్ మెటా నిమోవైరస్” సోకడం ఇదే ప్రథమం కాదని,ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ నూటికి నూరుశాతం మందికి సోకి ఉంటుందని, ఒకసారి ఈ వైరస్ సోకిన తర్వాత రోగ నిరోధక శక్తి పెరగడం వలన  రెండోసారి సోకే అవకాశం లేదని తెలుస్తున్నది. నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు హెచ్ఎంపివి సంక్రమించవచ్చని, ఇది అత్యంత సాధారణమైన  జలుబు మాత్రమేనని,భయాందోళన అనవసరమని చెబుతున్నారు.
65 సంవత్సరాల దాటిన వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ వైరస్ సోకవచ్చని,అయినప్పటికీ కోవిడ్ మాదిరిగా  ప్రమాదం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక సాధారణమైన జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు వచ్చి పోవడం, దానికి  మెటా నిమోవైరస్ కారణం కావడం వలన కొంత ఆందోళన చెందడం సహజమే. కాని కోవిడ్ తో పోల్చుకుని, భయభ్రాంతులకు గురికావడం, కొంతమంది అనవసరమైన ప్రచారాలతో, అవగాహన లేమితో, లేని పోని వార్తలు సృష్టించి, ప్రజలను భయాందోళనలకు గురిచేయడం సబబు కాదు. విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే సలహాలను పాటించాలి. అభివృద్ధి చెందిన దేశాలు, కోవిడ్ సమయంలో  వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలక భూమిక పోషించిన భారత్ వంటి దేశాలతో కలసి తరచూ తలెత్తుతున్న వైరస్ లపై విస్తృతంగా అధ్యయనం చేసి, ప్రపంచాన్ని మహమ్మారుల నుండి కాపాడాలి.
                 – సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
             మొ:9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *