– సోషల్ విూడియా విమర్శలపై ఎంపీ రఘునందన్ ఆగ్రహం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్12: దిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై సోషల్ విూడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా ఖండిరచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ’సర్దార్ ` ఏక్తా’ పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. బాంబు పేలుళ్లతో బీజేపీకీ ఏం సంబంధమని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు వస్తే బ్లాస్టులు జరుగుతు న్నాయని కొంతమంది సోషల్ విూడియాలో నీచంగా పోస్టు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే దేశద్రోహం మరొకటి ఉండదని అన్నారు. పేలుళ్లకు కారణమైన వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఎవరైతే నీచంగా మాట్లాడుతున్నారో ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాంటి వ్యక్తులను ఎవరూ సమర్థించవద్దని సూచించారు. చేతిలో ఫోన్ ఉందని కొంతమంది ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఎంపీ రఘునందన్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





