ఐక్యతే బంజారాల బలం

– బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
– బంజారా సంప్రదాయ నృత్యం చేసిన మంత్రి పొన్నం
– అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం
– హుస్నాబాద్ లో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 11: ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో బుధవారం నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారా మహిళలు, యువకులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సుమారు 287 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. ఆయన ఆశీస్సులతో సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఒకే భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ జయంతిని హుస్నాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హుస్నాబాద్ లో బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయించే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *