అటల్ స్ఫూర్తితో కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలి
బిజెపిలోకి యువతను భాగస్వాములు చేయాలి
కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 :భరతమాత సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్న తుడు అటల్‌బిహారీ వాజ్‌పేయి అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా జరిగిన సభలో కిషన్ రెడ్డి అన్నారు. సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే పార్టీ బిజెపి అని, వాజ్ పేయి తన జీవితాంతం నైతిక విలువలతో.. పత్రికా విలేకరిగా, జనసంఫ్‌ు పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యులుగా, జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుదీర్ఘమైన సేవలందించారని కొనియాడారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా తలొగ్గకుండా లక్షలాది మంది బిజెపి కార్యకర్తలను ముందుకు నడిపించిన గొప్ప యోధుడు వాజ్‌పేయి అని అన్నారు. వాజ్‌పేయి స్థాపించిన భారతీయ జనతా పార్టీలో మనమంతా సభ్యులుగా చేరడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు తన ప్రత్యేకతను, గొప్పతనాన్ని అడుగడుగునా చూపించారు. దేశంలో పాస్ పోర్టు రావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచి… సులభతరంగా ప్రతిఒక్కరికి పాస్ పోర్టు వొచ్చేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించి భారతదేశ ప్రత్యేకతను చాటిచెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇతర దేశాల ప్రతినిధులు ఆ దేశానికి చెందిన జాతీయ, ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతుంటే.. తాను కూడా భారతీయ భాష (హిందీ)లో మాట్లాడుతామంటూ మొరార్జీ దేశాయ్ అనుమతితో ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం అని కిషన్‌రెడ్డి కొనియాడారు.
నేడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి భారతదేశంపై విషం కక్కుతూ.. రాజ్యాంగబద్ధమైన సంస్థలను అవహేళన చేస్తూ, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. భారతదేశంలోని పార్లమెంటు వ్యవస్థకు వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ కు, న్యాయస్థానాలు, రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అవహేళన చేస్తూ రాహుల్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనాలని కోరి, భారత ప్రతినిధిగా పంపించారు. వాజ్ పేయి దేశ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రపంచ వేదికపై మాట్లాడారని గుర్తుచేశారు. దీంతో, ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. పార్లమెంటులో ఒక్క వోటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా.. వాజ్ పేయి నైతిక విలువలకు లోబడి ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిపారు. నైతికతతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్ననలు పొంది ప్రధానమంత్రి అయ్యారన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నైతిక విలువలతో కూడిన రాజకీయాల్లో భాగంగా వాజ్ పేయి ఒక్క వోటుతో ప్రభుత్వాన్ని వదులుకున్నారు. రూ.77వేల కోట్లతో స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు పేరుతో జాతీయ రహదారులు నిర్మించి అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసేలా పాలన అందించారు. అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనిచేస్తున్నారు.
వాజ్ పేయి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రత్యేక కార్యాచరణతో ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టి రైతలును ప్రోత్సహించారు. దేశంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేద ప్రజలకు అనేక ఇండ్లు కట్టించారు. వాజ్ పేయి హయాంలో దేశంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించిన జాతీయ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనే ప్రారంభించారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పేదలకు ఇండ్లు కట్టివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లకు భూమిపూజ కూడా చేయలేదు.
కార్గిల్ యుద్ధ సమయంలో కీలక పాత్ర
కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ను ఓడిరచడంలోనూ వాజ్ పేయి కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత భద్రతా అవసరాల నిమిత్తం అమెరికా ఒత్తిళ్లకూ లొంగకుండా వాజ్‌పేయి సారథ్యంలోని ప్రభుత్వం అణుశక్తి దేశంగా భారత్ ను తయారుచేసుకునేందుకు రాజస్థాన్ లోని ప్రోఖ్రాన్ లో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. భారత్ ను అణుశక్తి కలిగిన దేశంగా నిర్మించారు.
వాజ్ పేయి కఠోరమైన జాతీయ భావజాలంతో పనిచేశారని, పార్లమెంటులో వాజ్ పేయి ఉపన్యాసాన్ని అన్ని పార్టీల నాయకులు శ్రద్ధగా వినేవారనా, వాజ్ పేయి బహిరంగ సభకు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేవారని గుర్తుచేశారు.
నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అద్భుత పరిపాలనను అందిస్తున్నారని అన్నారు. విదేశాంగ విధానంలో, ప్రజలకు సేవచేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ లో మార్పులు తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియాతో కొత్త సాంకేతికతో అనేక మార్పులు తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారతదేశం ఎదిగింది. వాజ్‌పేయి స్ఫూర్తితో రానున్న మూడు సంవత్సరాల్లో దేశం కోసం పనిచేసే లక్షమంది యువకులను రాజకీయ నాయకులుగా తయారుచేయాలని మోదీజీ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, సామాజిక సంస్థల తరఫున అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. వాజ్ పేయి స్ఫూర్తితో యువతను బిజెపిలోకి తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాలకు సేవలందించాలి. దేశంలో మౌలిక వసతులను కల్పించే దిశ




