పూర్తి నిరాశజనకంగా కేంద్ర బడ్జెట్‌ ‌

– 8మంది బీజేపి ఎంపిలున్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
– పట్టణాల్లో కాంగ్రెస్‌నే గెలపించండి
– బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు

జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర,  2: రాష్ట్రం నుంచి ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రజలకు అవమానమని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ ‌ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పూర్తి నిరాశజనకంగా ఉందని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా విభజన చట్టంలోని 42 కీలక అంశాలు నేటికీ పెండింగ్‌లో ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశాల్లోనైనా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ కేంద్రం మళ్ళీ మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే స్పందించి విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్టాత్మక సంస్థల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును శ్రీధర్‌ ‌బాబు ఎండగట్టారు. తెలంగాణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ఐఐఎం ‌వంటి ఉన్నత విద్యాసంస్థ వస్తుందని రాష్ట్రం ఎంతో ఆశగా ఎదురుచూసిందని, కానీ బ్జడెట్‌లో దాని ఊసే లేకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్‌ ‌నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రో ఫేజ్‌-2 ‌విస్తరణకు నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం లేదన్నారు. విద్యా రంగంలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కేటాయింపులో కూడా రాష్టాన్రికి మొండిచేయి ఎదురైందని విమర్శించారు. ఐటి, పారిశ్రామిక రంగంలో కీలకమైన సెమీ కండక్టర్‌ ‌చిప్స్ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌పరిశ్రమలను తెలంగాణకు కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని, గతంలోనూ ఇదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌ఫార్మా పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవడం మన పాలనకు నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం కూడా తన బాధ్యతను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని శ్రీధర్‌ ‌బాబు కోరారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులకు వోటేసి గెలిపించాల

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు వోటేసి గెలిపించాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో పట్టణ ప్రాంత ప్రజలకు ఒరిగిందే లేదని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పట్టణ ప్రజలకు న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి, కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్వయంగా మున్సిపల్‌ ‌శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *