యుఎన్ఐ కార్యాలయం స్వాధీనం

– జర్నలిస్టులను బయటకు పంపిన పోలీసులు
– హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నిర్ణయం

న్యూదిల్లీ, మార్చి 21 : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి మూసివేశారు. పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ కార్యాలయంపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను బయటకు పంపించేశారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ఐ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు రక్షణ కల్పించేందుకు యూఎన్ఐ సిబ్బందిని ఖాళీ చేయించినట్లు డిప్యూటీ కవిమిషనర్ సచిన్ శర్మ తెలిపారు. అయితే తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని యూఎన్ఐ తన ప్రకటనలో తెలిపింది. బలవంతంగా ఆఫీసును ఖాళీ చేయించినట్లు ఆ సంస్థ ఆరోపించింది. కొందరు ఉద్యోగులను ఈడ్చుకెళ్లారని పేర్కొన్నది. న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేయడంతో శుక్రవారం రాత్రి పోలీసుల యూఎన్ఐ ఆఫీసును సీజ్ చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూఎన్ఐ ఆఫీసును ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ చర్య పత్రికా స్వేచ్ఛపై దాడిగా యూఎన్ఐ పేర్కొన్నది. నాలుగు దశాబ్దాల క్రితం కేటాయించిన భూమిపై ఏజెన్సీ ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. 1979 భూ కేటాయింపు చట్టం ప్రకారం భూమి తీసుకున్న రెండేళ్లలోనే నిర్మాణాన్ని చేపట్టాలి. కానీ యూఎనఐ ఆ పనిచేయలేదని హైకోర్టు వెల్లడించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *