రూ.లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీసిన సర్కారు

– 7న జరిగే మహా ధర్నాలో అందరూ పాల్గొనాలి
– బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా తెరతీసిందో, హిల్ట్‌ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు వివరించామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా జీవో నెంబర్‌ 27ను వ్యతిరేకిస్తున్నామని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ గవర్నర్‌కు మెమొరాండం సమర్పించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అనేక అవినీతి అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని,  దాదాపు రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్నా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేకపోయిందని విమర్శించారు. హిల్ట్‌ పాలసీ, జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచుతూ తీసుకొచ్చిన జీవోలు.. ఇలా అనేక కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 7న బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి, అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *