– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : కేరళంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో గల యూడిఎఫ్ 140 సీట్లకు గాను 100కు పైగా సీట్లను గెలుచుకుంటుందని రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆడూరు, అరుణ్ ములని యోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంతో అనుబంధం కలిగిన రాహుల్ గాంధీ, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మహిళలను చైతన్యపరుస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీల ప్రచారం కారణంగా ఈసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా యూడిఎఫ్ పయనమవుతోందన్నారు. కేరళంలో తెలంగాణ తరపున ఇప్పటికే పలువురు మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివిధ సభల్లో ప్రసంగిస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల మనసులో మార్పు వాతావరణాన్ని స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు అఖండ మెజార్టీ ఇవ్వాలని మంత్రి కోరారు. ఈసారి 100కి పైగా సీట్లు గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పాలనాపరంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) విఫలమైందని, అదేవిధంగా బిజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో యూడిఎఫ్ మాత్రమే కేరళంను అభివృద్ది పధంలో నడిపించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





