యుద్ధ కౌశలంతో సాధించిన విజయం, వ్యూహాత్మక సుస్థిరత…ఈ రెండూ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దౌత్యనీతిలోని ఔచిత్యానికి ఇది చక్కగా సరిపోతుంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ 30వేల అడుగుల ఎత్తునుంచి బాంబుదాడులు జరపడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనుకోవడం కేవలం ఒంటెద్దు పోకడలతో కూడిన పెద్దన్న వైఖరికి ప్రబల నిదర్శనం. ఈవిధంగా ఒక పక్క సైనిక చర్యలు చేపడుతూ మరోపక్క వీటిని ప్రజాస్వామిక చర్యలుగా చెప్పుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్, లిబియా నుంచి ఇప్పుడు ఇరాన్ ల విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి ఒక్కటే: బాంబుదాడులు జరుపడం, మిషన్ పూర్తయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం. కానీ దీని తర్వాత ఆయా దేశాలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, అంతర్గత తిరుగుబాట్లు ఈ దౌత్య సంబంధాలను నాలుగు రోడ్ల కూడలిలో నిలిపాయి. అయినప్పటికీ యుద్ధాలను ఆపేశాను కనుక నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ తనను తాను ప్రపంచానికి చూపుకోవడానికి ట్రంప్ యత్నిస్తున్నారు. దౌత్య నీతి ఎంతమాత్రం పట్టని డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకున్న సంబంధాలను తెంచుకొని బయటపడాలన్న ఆలోచనతో ముందుకెళుతున్నారు.
ఫలితంగా ప్రపంచ క్రమానికి సంబంధించిన దౌత్యం నాలుగురోడ్ల కూడలిలో పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నది. అంతేకాదు ఈ ప్రపంచ క్రమం అనేది వర్తకానికి పనికొచ్చే వస్తువుగా లేదా యు.ఎస్. ప్రయోజనాలకు ప్రమాదకరమని భావించినప్పుడు అటువంటి దేశాలపై బాంబుదాడులు వేసి నిర్వీర్యం చేసే హక్కుగా మారిపోయింది. అయితే ఒకే సమయంలో ఈ రెండూ జరగడం సాధ్యంకాదు. అంటే వర్తకం, బాంబు దాడులు…ఈ రెండూ ఒకదానికొకటి సంబంధం లేనివి!
ఇక్కడ ప్రధానంగా వినిపించే ప్రశ్న ఏమంటే, పాకిస్తాన్ వంటి ధూర్తదేశం ఉగ్రవాదుల ఉత్పత్తి స్థానంగా కొనసాగుతూ, అణ్వస్త్రాలను కలిగివున్నప్పుడు, ఇరాన్ వాటిని ఎందుకు కలిగివుండకూడదన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. తన అణుకార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామని ఇరాన్ ఒకవైపు స్పష్టం చేస్తున్నప్పుడు, యు.ఎస్-ఇజ్రాయిల్ దేశాలు, అణ్వస్త్రాలు కలిగిన ఇరాన్ తమ సరసన ఉండటానికి వీల్లేదని భావిస్తున్నాయి. అణ్వస్త్రాలు కలిగిన ఇరాన్, ఉగ్రవాద నిర్మూలన నిబంధనల ప్రకారం ఇజ్రాయిల్ పక్కనే ఉనికిలో ఉండటానికి వీల్లేనప్పుడు, భారత్ పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోయడమే కాకుండా ఇటీవలికాలంలో యుద్ధానికి దిగిన సందర్భాన్ని ఏవిధంగా పరిగణించాలి? అంటే ఉగ్రవాదాన్ని ఎగదోసే ఇరాన్‌కు ఒకనీతి, పాకిస్తాన్‌కు మరో నీతి…ఇదెక్కడి రీతి?
సుహృద్భావంతో కూడిన దేశాలు మారిన వర్తమాన ప్రమాదకర పరిణామాల నేపథ్యంలో ఏదో ఒక గ్రూపుకు మద్దతివ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా మార్గదర్శనంలో, ప్రపంచ క్రమంలోని నేటి దేశాలు ఆడుతున్న ఒక గొప్ప దౌత్యపరమైన నాటకంగా నేటి పరిణామాలను భావించవచ్చు. ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్‌పై సాహసవంతుడైన డోనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా దాని అణ్వస్త్ర ప్రదేశాలపై దాడులు చేయడం తన బల ప్రదర్శన ద్వారా శాంతి స్థాపనకు సంబంధించిన అట్టహాస ప్రదర్శనగా ప్రపంచానికి చూపుకోవచ్చు.
అంతేకాదు ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అమెరికా వినాశనాన్ని కోరుతున్న అతిపెద్ద దేశమైన ఇరాన్, అణ్వస్త్రాలను పొందడం లేదా ఉపయోగించడం చేయకూడదన్నది అమెరికా దాడుల వెనుక ఆంతర్యమన్నది సుస్పష్టం. అంతేకాదు ప్రస్తుతం ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న చర్య దాని కాపట్యాన్ని మరింత బహిర్గతం చేస్తున్నది. ఒకపక్క ఇరాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటిస్తూ మరో పక్క పాకిస్తాన్‌తో సానుకూల వైఖరి ప్రదర్శన అమెరికా దౌత్య పరమైన కపటనీతికి ప్రత్యక్ష నిదర్శనం. భారత్‌కు వెయ్యి గాయాలు చేస్తానని పాకిస్తాన్ ప్రకటించిన సంగతి యు.ఎస్.కు తెలియదనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరోటుండదు.
భారత్-పాకిస్తాన్, ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణల్లో పరిస్థితిని చక్కదిద్దుతానంటూ తలదూర్చడమే కాకుండా ట్రంప్ అనుసరించిన దౌత్యనీతి వంచన తప్ప మరోటి కాదు. మధ్యవర్తిత్వ ఫలితంగా భారత్-పాకిస్తాన్‌లు సంఘర్షణలు మరింత ప్రజ్వరిల్లకుండా ఆగిపోయాయని ట్రంప్ చెప్పుకుంటున్నారు. మరి ఇజ్రాయిల్-ఇరాన్‌ల విషయానికి వచ్చేసరికి ఎన్నో అపరిష్కృత సమస్యలు యథాతథంగా వున్న నేపథ్యంలో, కాల్పులు విరమణ ప్రకియ జిత్తుల మారితన ప్రదర్శనగా మారింది. ఇక్కడ ప్రధానంగా వినిపించే ప్రశ్న ఏమంటే, పాకిస్తాన్ వంటి ధూర్తదేశం ఉగ్రవాదుల ఉత్పత్తి స్థానంగా కొనసాగుతూ, అణ్వస్త్రాలను కలిగివున్నప్పుడు, ఇరాన్ వాటిని ఎందుకు కలిగివుండకూడదన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
తన అణుకార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామని ఇరాన్ ఒకవైపు స్పష్టం చేస్తున్నప్పుడు, యు.ఎస్-ఇజ్రాయిల్ దేశాలు, అణ్వస్త్రాలు కలిగిన ఇరాన్ తమ సరసన వుండటానికి వీల్లేదని భావిస్తున్నాయి. అణ్వస్త్రాలు కలిగిన ఇరాన్, ఉగ్రవాద నిర్మూలన నిబంధనల ప్రకారం ఇజ్రాయిల్ పక్కనే ఉనికిలో ఉండటానికి వీల్లేనప్పుడు, భారత్ పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోయడమే కాకుండా ఇటీవలికాలంలో యుద్ధానికి దిగిన సందర్భాన్ని ఏవిధంగా పరిగణించాలి? అంటే ఉగ్రవాదాన్ని ఎగదోసే ఇరాన్‌కు ఒకనీతి, పాకిస్తాన్‌కు మరో నీతి…ఇదెక్కడి రీతి? పాకిస్తాన్ తన వద్ద అణ్వస్త్రాలను చూపుతూ, ఇతర దేశాలకు, ఉగ్రవాదులకు తన బలాన్ని చూపడమే కాకుండా తక్కువ స్థాయి దాడుల ద్వారా భారత్‌కు వెయ్యి గాయాలయ్యే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఖండనార్హం. ఇటువంటి అణ్వస్త్రాలు పాకిస్తాన్ వద్ద వుండటం భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇవి ఏదో రూపంలో ఉగ్రవాదుల చేతుల్లో పడితే అవి పిచ్చివాడి చేతిలో రాయిలాగా మారి తీరని నష్టాన్ని కలుగజేస్తాయి. అంటే ఇరాన్, పాకిస్తాన్‌ల చేతుల్లో ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలు సరిసమానంగా ఉన్నాయి.
ఇదే సమయంలో పాకిస్తాన్ తన అణ్వస్త్ర వినియోగంపై ఒక విస్పష్టమైన విధానాన్ని వెల్లడించలేదు. అంటే ఎప్పుడైనా, ఏ దశలోనైనా అణ్వస్త్రాలను అది ప్రయోగించగలదు. ఆ విధంగా ప్రయోగిస్తామని హెచ్చరించడం ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌కు పరిపాటిగా మారింది. అంతేకాదు మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేయబోమన్న విధానం దానికి లేదు. అందువల్ల ఇరాన్‌తో పోలిస్తే పాక్ అణ్వస్త్ర విధానం అత్యంత ప్రమాదకరమైంది. ఇదే సమయంలో అమెరికా అండ చూసుకొని, ప్రాంతీయంగా తన ప్రయోజనాలను సాధించుకోవడానికి పాక్ అడ్డమైన పద్ధతులు అనుసరిస్తోంది.
దీన్ని పరిశీలిస్తే అణ్వస్త్ర దేశాలైన ఇరాన్, పాకిస్తాన్‌లతో అమెరికా వంచనాత్మక దౌత్యనీతిని అనుసరిస్తోందని చెప్పక తప్పదు. దౌత్యపరంగా అమెరికా ఇస్తున్న రక్షణ కూడా పాక్‌కు వరంగా మారింది. భారత్‌పై అణ్వస్త్ర ప్రయోగం చేస్తానని పాకిస్తాన్ మాటిమాటికీ బెదిరించడం వెనుక అమెరికా దన్ను ఉన్నదన్న సత్యాన్ని మరువకూడదు. చివరకు పాక్ అణు బెదిరింపులవల్లనే ఇరుదేశాల మధ్య ఘర్షణను నివారించడానికి మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ప్రచారం చేసుకోవడానికి వీలైంది. అంతేకాదు ఒకవైపు పాకిస్తాన్ తన దుందుడుకు వైఖరితో పరిస్థితులను అస్థిరం చేయడానికి యత్నిస్తున్నా చివరిలో ట్రంప్ పాకిస్తాన్ కుఅనుకూలంగా తన వైఖరిని మార్చుకున్నప్పుడు భారత నాయకత్వం మౌనంగా ఉండిపోవడం గమనార్హం.
మధ్యప్రాచ్యంలో తనకు అత్యంత వ్యూహాత్మక సహచరుడిగా ఉన్న ఇరాన్‌పై దాడిని భారత్ ఖండించలేదు. అంతకు ముందు భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ ఎంతో సంయమనం పాటించిందని ట్రంప్ ప్రశంసలు కురిపించినప్పుడు కూడా భారత్ మౌనంగానే ఉండిపోయింది. ముఖ్యంగా యు.ఎస్.తో విస్తరిస్తున్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఈ వ్యూహాత్మక మౌనాన్ని పాటించివుండవచ్చు. ఇక ముందు పాకిస్తాన్-అమెరికాల మధ్య కొనసాగే సంబంధాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశాలే ఎక్కువ. 21వ శతాబ్దంలో యు.ఎస్.తో ఎంతగా వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తున్నా, ట్రంప్ వంచనాత్మక వైఖరితో భారత్ ఇబ్బంది పడుతోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే యు.ఎస్. కపటనాటక వైఖరివల్ల భారత్‌కు ఒరిగింది చాలా తక్కువ! భారత నాయకత్వం అమెరికాతో ప్రత్యేక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఈ కుహనా స్నేహితుడితో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదనే చెప్పాలి. అమెరికాతో ప్రత్యేక ప్రతిపత్తి అనే ఉచ్చులో చిక్కుకుపోయి ఒక విదూషకుడి మాదిరిగా వ్యవహరిస్తున్న ట్రంప్ స్నేహాన్ని ఆస్వాదిస్తున్న తమ అధినాయకుల వ్యవహారశైలిని దేశ ప్రజలు ఎటువంటి శషభిషలు లేకుండా కచ్చితంగా అంచనా వేస్తున్నారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.





