హోలీ పండగ రోజు విషాదం

– ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 3 :హోలీ పండగ  రోజు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతితో సూరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ ఆడిన అనంతరం సమీపంలోని పంతులు చెరువు వ‌ద్ద‌కు ఈత, స్నానం చేసేందుకు వెళ్లారు. అందులో ముగ్గురు షాంపూ తీసుకురావడానికి బ‌య‌ట‌కు వెళ్లగా సాగర్ (17), అభిషేక్ (17) చెరువులోకి స్నానానికి దిగారు. షాంపూ తీసుకొని వచ్చిన ముగ్గురు స్నేహితులు చెరువు వద్దకు చేరుకునేస‌రికి ఆ ఇద్దరు యువకులు నీట మునిగి మృతిచెందారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరారం సిఐ సుదీర్ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
—————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *