– తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు
– పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పాలి
– పేరొందిన పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు
– ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియా లో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేళ్ల విజయోత్స వాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున, రెండే ళ్ల విజ యోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచ ర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదే శించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆక ట్టుకు నే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపిం చాలని అన్నారు. డిసెంబర్ 8వ తేదీ, తొలి రో జున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలన్నారు. 9వ తే దీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శ నికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత ను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభా గాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్ర త్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదే శించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్ర త కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పా ట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాల ని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాల ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సీ ఎం ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరి చే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకో. వాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశా రు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యు మెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీ క్షలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాల న్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తా మన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్ల తో పాటు రెండేండ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానం గా సమీక్ష జరుపుతామన్నారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలం గాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన జరిగిందని సీఎం తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్ కు తుదిరూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





