రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభకు ఏకగ్రీవం

– ధ్రువీకరణ పత్రాలు అందజేత

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ ‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున వేం నరేంద‌ర్ రెడ్డి, అభిషేక్‌ ‌మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను వీరికి అందజేసినట్లు తెలిపారు.అభిషేక్‌ ‌మను సింఘ్వీ తరఫున అడ్వకేట్‌ ‌సుందర్‌ ‌చౌహాన్‌ అం‌దుకున్నారు. వేం నరేందర్‌ ‌రెడ్డి అసెంబ్లీ కార్యాలయానికి వచ్చి ధృవీకరణ పత్రం స్వీకరించారు. రాజ్యసభలో పలువురి సభ్యుల పదవి కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల షెడ్యుల్‌ ‌విడుదల చేసింది. గురువారంతో నామినేషన్ల ప్రకియ ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ‌తరఫున  నుంచి అభిషేక్‌ ‌మను సింఘ్వీ, వేం నరేందర్‌ ‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ ‌రెడ్డికి వీరు తమ నామినేషన్‌ ‌పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక సాయి అనే వ్యక్తి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ ‌వేశారు. అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో శుక్రవారం ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. అలాగే ఇతరులు ఎవ్వరూ నామినేషన్ల దాఖలు చేయలేదు. దీంతో అభిషేక్‌, ‌నరేందర్‌ ‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *