టిప్ప‌ర్ ఢీ.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం 

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 6 : ఇంజనీరింగ్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు టిప్పర్ టైర్ల కింద నలిగిపోయింది. ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు ప్రమాద దృశ్యాలను చూసి త‌ట్టుకోలేక‌పోయారు. తోటి విద్యార్థుల హృదయ వేదన చూపరుల‌ను కన్నీరు పెట్టించింది. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈఈఈ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి బైక్ పై వెళ్తున్నారు. హసన్‌ప‌ర్తి పెద్ద చెరువు వద్ద టిప్పర్ ఢీకొన‌డంతో ఇద్ద‌రూ దాని టైర్ల కింద న‌లిగిపోయారు. హనుమకొండకు చెందిన అక్రమ్, సుప్రతిక్ లు మంచి మిత్రులు. ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ హసన్‌ప‌ర్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
—————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *