– సరిహద్దుల్లో డ్రోన్లతో దాడికి యత్నం
న్యూదిల్లీ, జనవరి 16: స్నేహం కొనసాగిస్తాం అంటూనే పాకిస్థాన్ మరోవైపు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి రెండు పాక్ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి యాంటీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టడంతో అవి వెనుదిరిగాయి. ఇది ఈ వారంలోనే మూడోసారి అంటున్నారు. పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గణతంత్ర దిన వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. డ్రోన్ల కదలికల తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మంగళవారం రాత్రి రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి వచ్చిన అనుమానిత పాక్ డ్రోన్లను అడ్డగించడానికి ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




