ఆటోలో రెండు మృతదేహాలు

– దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3:‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్‌ ‌హోటల్‌ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అధిక మోతాదులో డ్రగ్స్ ‌తీసుకోవడంతోనే వారు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో క్లూస్‌ ‌టీమ్‌ ఆధారాలను సేకరించింది. అక్కడ మూడు సిరంజీలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఘటనా స్థలంలో క్లూస్‌ ‌టీమ్‌ ‌సాయంతో ఆధారాలు సేకరించారు. అక్కడ మూడు సిరంజీలు లభించాయి. దీంతో అధిక మోతాదులోడ్రగ్స్ ‌తీసుకోవడంతోనే వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *