రెండు రోజుల ఎన్‌కౌంటర్లు బూటకం

– అదుపులోకి తీసుకుని దారుణంగా కాల్చి
– కోర్టులో హాజరు పర్చకుండా ఎన్‌కౌంటర్‌
– ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు సీపీఎం డిమాండ్‌

‌విజయవాడ,నవంబర్‌ 19: మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  డిమాండ్‌ ‌చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్‌కౌంటర్‌ ‌చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్‌కౌంటర్లను సీపీఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారన్నారు. వివిధచోట్ల నిర్బంధించిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం నేత శ్రీనివాసరావు డిమాండ్‌ ‌చేశారు. కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల అనంతరం వారందరినీ పోలీసులు న్యాయమూర్తి ముందు ఉంచారు. వీరికి కోర్టు రిమాండ్‌ ‌విధించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page