– లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: సైబర్ క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్‌ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. మల్కాగిజిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీ నగర్ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ సోమవారం రూ. లక్ష లంచం తీసుకుంటుండంగా పట్టుబడ్డారు. ఎల్‌బీ నగర్ చౌరస్తాలో ఎస్సై జటావత్ బాబు ఈ డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో దాడుల నిర్వహించి పట్టుకున్నారు. లక్ష రూపాయల నగదును పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా విధుల ఉల్లంఘలకు పాల్పడి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ శాఖ సూచించింది. సోషల్ డియా నంబర్ 9440446106 అనే వాట్సప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.