– మంచిర్యాలలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు..
మంచిర్యాల/ఖమ్మం,ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా ఎక్కడోచోట ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంచిర్యాల, ఖమ్మం జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. వరి నాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాకు 23 మంది కూలీలు బొలెరోలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇందారం క్రాస్ వద్ద బొలెరో కొద్దిసేపు ఆగింది. ఇంతలో ఓ లారీ అతి వేగంగా దూసుకొచ్చి బొలెరోను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను జిల్లా హాస్పిటల్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. ఇక ఖమ్మం జిల్లా రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నాయుడుపేట బైపాస్ రోడ్డు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న పాముల కేశవులు అనే ద్విచక్ర వాహనదారుడిని ఖమ్మం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో కేశవులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఖమ్మం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





