– ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు ప్రియుడిపై మోజు
– హత్య కేసులో పోలీసులు నిర్ధారణ
నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పా రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవటం, ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్ భార్య నమ్మించింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు సౌమ్య, దిలీప్ ఒప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్ తో ఆమెకు పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్ కు తెలియడంతో ఇద్దరినీ గట్టిగా మందలించాడు. దీంతో భర్తని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి సౌమ్య ప్లాన్ వేసింది. గత నెల 20న సామ్య తన ప్రియుడు ఇంట్లోనే హత్య చేశారు. భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు నమ్మించి ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




