ఛత్తీస్‌గడ్‌లో రెండు ఎన్‌కౌంట‌ర్లు

– 14 మంది మావోయిస్టుల మృతి
– మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు
– కొంట ఏరియా కమిటీ లేకుండా చేసాం : బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర

‌భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 3 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోతమోగింది. రెండు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో 14మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం బీజాపూర్‌ ‌జిల్లా  ‌కొంటా కిస్టారం అడవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 12 మంది మావోయిస్టులు మృత్యుదాతపడ్డారు. డిస్ట్రిక్ట్ ‌రిజర్వ్ ‌గార్డ్, ‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ , ‌కోబ్రా బెటాలియన్‌తో సంయుక్తంగా ఆపరేషన్‌ ‌చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో మావోయిస్టులు మొదట కాల్పులు జరపగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి. గంటల తరబడి కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్‌ ‌మంగ్గు అలియాస్‌ ‌మంగడు ఉన్నట్లు సమాచారం. మృతువద్ద 3 ఏకె-47 రైఫిల్స్‌తో పాటు ఎస్‌ల్‌ఆర్‌, ఐన్‌స్‌ఏఎస్‌ 303 ‌రైఫిల్స్, ‌మందుగుండు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ ఆపరేషన్‌లో జవాన్లు గాయపడ్డారు కానీ ప్రాణాపాయం లేదన్నారు. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా క్లియర్‌ ‌చేశాము’ అని చెప్పారు. బస్తర్‌ ‌రేంజ్‌ ఐజీ సుందర్రాజ్‌ కూడా ఈ విజయాన్ని గర్వపడ్డారు. అలాగే బీజాపూర్‌ ‌జిల్లా బాసగూడ పోలీస్‌ ‌స్టేషన్‌లోని గగన్‌పల్లి-ముర్కిపర్‌ అటవీ కొండల్లో ఉదయం 5 గంటల నుంచి డీఆర్‌జీ బీజాపూర్‌, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి . ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతిచెందారు. గగన్‌పల్లి-ముర్కిపర్‌ అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్‌జీ బీజాపూర్‌ ‌సెర్చ్ ఆపరేషన్‌ ‌ప్రారంభించారు. ఘటనా స్థలం వద్ద రైఫిల్‌, 12 ‌బోర్‌ ‌కంట్రీ మేడ్‌ ‌పిస్టల్‌ , పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *