న‌గ‌రంలో బుల్లితెర న‌టి సంద‌డి

ధనైరా సిల్క్స్ ను ప్రారంభించిన సుహాసిని

కాజిపేట, ప్రజాతంత్ర: హనుమకొండలోనితెలంగాణ చౌరస్తా ప్రాంతంలో గురువారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర సూపర్ స్టార్ నటి సుహాసిని (Suhasini) , డైరెక్టర్ కార్తీక్ రెడ్డి (Karthik Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వీరికి నిర్వాహకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ చారిత్రక నగరమ‌ని, ఈ ప్రాంతంలోని ఆలయాలు, ప్రజలు తనకు ఎంతగానో నచ్చాయని అన్నారు. ధనైరా సిల్క్ యాజమాన్యం మహిళలకు ఎన్నో రకాల పట్టు చీరలను తక్కువ ధరల్లో అందిస్తున్నారని, మహిళలు మెచ్చిన పట్టు వస్త్రాలను పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు ధనైరా సిల్క్ వస్త్ర నిలయం వేదిక అవుతుందన్నారు. రూ.10 వేల కొనుగోలుపై 4 గ్రాముల వెండి నాణెం, రూ.20 వేల కొనుగోలుపై 8 గ్రాముల వెండి నాణెం, రూ.50 వేల కొనుగోలుపై 20 గ్రాముల వెండి నాణెం బహుమతిగా ధనేరా సిల్క్ యాజమాన్యం ప్రత్యేకంగా మహిళలకు అందజేయనున్నారని వివరించారు. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మహిళలకు 150 మందికి ఉచితంగా చీరలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వంగాల భవాని దిలీప్ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్లు గురువారం నుంచి ఆగస్టు 27 వరకు వినాయక చవితి పండుగ సందర్భంగా అందిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *