– విజయవంతమైన టీయూడబ్ల్యూజే మహా ధర్నా
– జర్నలిస్టుల నినాదాలతో దద్దరిల్లిన మహానగరం
– రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు తరలివచ్చిన జర్నలిస్టులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహా ధర్నా విజయవంతం అయింది. టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం నలుమూలల నుండి జర్నలిస్టులు భారీగా తరలి రావడం విశేషం. జర్నలిస్టుల నినాదాలతో మహానగరం దద్దరిల్లింది. సమాచార శాఖ చరిత్రలో ఆ కార్యాలయం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రథమని పోలీసు అధికారులు సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడం విశేషం. ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతోపాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జవహర్‌లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహా ధర్నాలో భాగస్వామ్యం అయ్యాయి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఎ.మాజీద్, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, నగునూరి శేఖర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి, వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు ఎ.రాజేష్, ఉర్దూ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల, కళ్యాణం రాజేశ్వరి తదితరులు మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




