తుమ్మిడిహట్టిపై హరీష్‌ అబద్దాలు

– అంచనాలే బడ్జెట్‌ ‌లెక్కలా?
– అతి తెలివితేటలు వొద్దని మంత్రి ఉత్తమ్‌ ‌హిత‌వు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 19:తుమ్మిడిహట్టి బ్యారేజ్‌, ‌చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్‌ ‌నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. దీనిపై అబద్దపు లెక్కలు కట్టిన హరీష్‌ ‌రవు తీరుపై మంత్రి మండిపడ్డారు.  మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్‌ ‌నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్‌ ‌రావు చేసిన ప్రకటన అసత్యమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితిలో హరీష్‌ ‌రావు అంచనాలు ఎలా చెబుతారు? ఇది ఆయన అతితెలివి తేటలకు అద్దం పడుతున్నట్లే అని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. హరీష్‌ ‌రావు చేస్తున్న 35 వేల కోట్ల వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రకటనలు అవాస్తవమని, ఇవి పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతోనే చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ హరీష్‌ ‌రావు లాంటి నేతలు అసత్య ప్రచారం చేయడం తగదు. తెలంగాణ సమాజం ఇలాంటి వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి‘ అని మంత్రి హెచ్చరించారు. తన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, ముఖ్యంగా రైతు సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హా ఇచ్చారు. సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.#Harish #lies #Tummidihatti #Minister Uttam #fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *