విదేశాల నుంచి ఆగిన యూరియా దిగుమతులు

– కొరత అందుకేనని వెల్లడించిన కేంద్రం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

న్యూదిల్లీ,సెప్టెంబర్‌3: ‌యుద్ధాల కారణంగా కేంద్రం ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోలేదని, అందువల్లనే కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో యూరియా సరైన సమయంలో ఉత్పత్తి చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కొరత తెలంగాణను కూడా పీడిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల్లో 5.3 లక్షల టన్నులే సరఫరా చేశారు. ప్రతి నెలలో పంపిణీ చేయాల్సిన యూరియాలో కోత పెట్టారు. సెప్టెంబర్‌లో రావాల్సిన 1.6 లక్షల టన్నులు సరఫరా చేయలేదు. ఇతర దేశాల నుంచి వొస్తోన్న యూరియానే సరఫరా చేస్తున్నారు. రామగుండం పరిశ్రమ నుంచి కూడా ఒక్క బస్తా ఇవ్వలేదు. కొరత కారణంగా రాష్ట్ర రైతులు ఆందోళనలో ఉన్నారు. అన్ని పంటలకు సెప్టెంబర్‌లో యూరియా చివరి కోటా వేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల భారీ వర్షాల వల్ల ఆరేడు జిల్లాల్లో అన్ని శాఖల్లో తీవ్ర నష్టం సంభవించింది.. రాష్ట్రంలో పంటలు, రోడ్లు, మౌలిక సౌకర్యాలు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పారు. చేనేత రంగంపై పన్నులు ఉండకూడదని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కాళేశ్వరం వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇచ్చినట్లు తెలిపారు. ఏది ఉన్నా వాళ్లే చూసుకుంటారన్నారు. ఇదిలావుంటే దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి  శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌గెలలకు టన్నుకు రూ. 25000 కనీస మద్ధతు ధర కల్పించేలా ఆయిల్‌ ‌పామ్‌ ‌దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి విజ్ఞప్తి.చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *