– భారత్‌తో సుంకాలపై చర్చిస్తామని సూచన
వాషింగ్టన్, సెప్టెంబర్ 10: సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకూ మారుతోంది. భారత్‌కు మళ్లీ చేరువ కావాలని ఆయన తపిస్తున్నారు. తాజాగా తన సోషల్ విూడియా ’ట్రూత్’ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామన్నారు. రష్యా నుంచి అధికస్థాయిలో భారత్ చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతుండడంపై ఇటీవలి వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు కూడా. అయితే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చి భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదంటూ ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. మోదీకి తానెప్పుడూ స్నేహితుడినన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.