గవర్నర్‌ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి

– సంపూర్ణ మద్దతు ప్రకటించిన ట్రంప్‌

న్యూయార్క్‌, నవంబర్‌ 8: మూడు అమెరికా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు గెలుపొందిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అప్రమత్తమయ్యారు. ఒహాయో గవర్నర్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్‌ నేత, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. వివేక్‌కు అండగా ఉండాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఒహాయాలో ఇప్పటికే వివేక్‌ తన సత్తా చాటారని గుర్తు చేశారు. వివేక్‌పై ట్రంప్‌ మద్దతుదారులు కొందరు జాత్యపరాకారం ప్రదర్శిస్తున్న తరుణంలో ఈ పోస్టు ఆసక్తికరంగా మారింది. వివేక్‌పై ప్రశంసలు కురిపిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ విూడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఈ పోస్టు పెట్టారు. ’నాకు వివేక్‌ బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతో పోటీ పడ్డారు. అతడు యువకుడు.. చాలా స్మార్ట్‌. మన దేశమంటే ఆయనకు నిజంగా ఎంతో ఇష్టం’ అని ప్రశంసలు కురిపించారు. ’విూ రాష్ట్ర గవర్నర్‌గా వివేక్‌ ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారు. పన్నులు తగ్గించేందుకు, నిబంధనలను సరళతరం చేసేందుకు, మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ విధానాన్ని ప్రోత్సహించేందుకు శ్రమిస్తారు’ అని పేర్కొన్నారు. ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు వివేక్‌ కృషి చేస్తారని కూడా హావిూ ఇచ్చారు. నేరాల నిర్మూలన, మిలిటరీ సిబ్బంది కోసం సంక్షేమ చర్యలు, లా అండ్‌ ఆర్డర్‌, ఎన్నికల వ్యవస్థ సమగ్రతను ఆయన కాపాడతారని తెలిపారు. అమెరికా రాజ్యాంగంలోని రెండో అమెండ్‌మెంట్‌కు (తుపాకీని కలిగి ఉండే హక్కు) రక్షణగా నిలుస్తారని కూడా ట్రంప్‌ చెప్పారు. అమెరికన్లను వివేక్‌ ఎప్పుడూ నిరాశపరచరని హావిూ ఇచ్చారు. ఒహాయోకు అద్భుత గవర్నర్‌గా వివేక్‌ నిలుస్తారని తాను స్వయంగా హావిూ ఇస్తున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *