ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం

– అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు

వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విసÊఋత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. అయితే దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్‌ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే భారత్‌పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *