~ గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25ః భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులోని ఆయన విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు పుష్పాంజలి ఘటించారు. అటల్ జీ జీవితం రాజ నీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, కవిత్వం సదా స్మరణీయమని వారు కొనియాడారు. ఆయన వారసత్వం తరతరాల భారతీయులకు నిరంతరం ప్రేరణనిస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్బం బడారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎంఎల్‌సీ మల్క కొమరయ్య, భరత్ గౌడ్ , రాష్ట్ర , జిల్లా నాయకులు,బీజేపీ రాష్ట్ర కార్యాలయ పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





