సిపాయి తిరుగుబాటులో అమరులకు నివాళులు

– బీసీ కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా హైదరాబాద్ కోటి అశోక స్తంభం వద్ద ఉన్న అమర వీరుల స్మారక స్థూపానికి తెలంగాణ బీసీ కమిషన్ చైైర్మన్ జి.నిరంజన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1857 సిపాయి తిరుగుబాటులో అమరులైన వీరులను స్మరించుకున్నారు. అనంత‌రం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మహనీయులు మ‌హాత్మాగాంధీ, డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్, బాలలక్ష్మి రంగు, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సతీష్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *