పుల్వామా అమరులకు నివాళి

– కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డాక్ట‌ర్‌ కావ్య

వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 14) ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. హనుమకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిగ్నల్ పాయింట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీ లో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ దేశం కోసం జవాన్లు చేసిన ప్రాణత్యాగం, దేశ భక్తి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయ‌ని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కొవ్వొత్తుల వెలుగుతో అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి అజేయ ఆత్మస్థైర్యానికి వందనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జి.సురేందర్ నాథ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్. నారాయణ చారి, జనరల్ సెక్రటరీ, ఎలిగేటి శ్రీనివాస్, కోశాధికారి కిషోర్ జి, సీఏపీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *