– ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్‌ల నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరా గాంధీ అసాధారణ నాయకత్వం, ఆమె దేశ సేవా భావం, జాతి ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆమె దూరదృష్టి, ధైర్యం,, దేశాభివృద్ధి పట్ల ఆమెకున్న అంకితభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళ సాధికారత, జాతీయ అభివృద్ధి పట్ల ఆమె చూపిన కృషిని రాజయ్య, నిరంజన్‌లు ప్రస్తుతించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





