పురుషోత్తం రెడ్డికి ఘన నివాళులు

– మంత్రి ఉత్తమ్‌కు ముఖ్యమంత్రి సహా పలువురి పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురోషోత్తం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు పలువురు ఆయనకు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు హాజరై పురుషోత్తం రెడ్డికి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కుందురు జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డిలు కూడా నివాళులర్పించారు. అంతే గాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వారంతా మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌ను ప‌రామ‌ర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *