సీనియర్‌ సిటిజన్స్‌కు ట్రిబ్యునల్‌ బెంచ్‌ వరం

– ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, డాక్టర్‌ అనితా రెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 7: సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌, ట్రిబ్యునల్‌ బెంచ్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కేసులు త్వరగా పూర్తిచేస్తున్నామని హన్మకొండ ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డిలు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ట్రిబ్యునల్‌ కోర్టు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, డాక్టర్‌ అనితా రెడ్డిలు కేక్‌ కట్‌ చేసి సిబ్బందికి మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్స్‌కు ట్రిబ్యునల్‌ బెంచ్‌ వరం అని అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌కు ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు, ట్రిబ్యునల్‌ బెంచ్‌ పట్ల ఇంకా ప్రజల్లో సరైన అవగాహన లేదని, గ్రామస్ధాయి నుండి నగర స్ధాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీనికి అందరూ భాధ్యత తీసుకోవాలని అన్నారు. వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదన్నారు, తమకు ఏ చట్టాలు ఉన్నాయి అనేది తెలుసుకుని తమ హక్కులు వినియోగించుకోవాలని, సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం వృద్ధులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కాగా, తల్లిదండ్రుల భాధ్యత కచ్చితంగా పిల్లలదేనని, తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని యువతను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రజినీకాంత్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *