హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి తనకు వివరాలు ఇవ్వాలని, ఆ మేరకు పనులు చేసుకుంటూ వెళ్తామని అన్నారు. గిరిజన సంక్షేమ పథకాలు అన్నీ అడవులలో చివరి మజిలీలో ఉన్న చివరి గిరిజనుడికి కూడా చేరేలా ప్రణాళికలు రచించాలని, ప్రత్యేకించి గిరిజనుల ఆరోగ్యం, విద్యావకాశాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గిరిజన సంక్షేమం మీద పూర్తి అవగాహన ఏర్పరచుకుని వారం రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను, సంక్షేమ అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. తొలుత శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ బాలు, గిరిజన పరిశోధన సంస్థ సంచాలకురాలు డాక్టర్ వి.సముజ్వల, జీసీసీ జీఎం ప్రతాప్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు పోచం, సంధ్యారాణి తదితర అధికారులు డైరెక్టర్ సంతోష్‌కు పూల మొక్కలు ఇచ్చి ఆహ్వానం పలికారు. సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సచివాలయానికి వెళ్ళి సంక్షేమ శాఖల స్పెషల్ చీఫ్t సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌కు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




